మరో తలపోటు, సాక్షినుండి మూడుకొత్త ఛానెళ్ళు?!



తెలుగు టీవీ ప్రేక్షకులు ఏం పాపం చేసుకున్నారో తెలియదు కానీ కొందరు అదే పనిగా వాళ్ళ మీద కక్ష్య సాధింపు చేస్తున్నారు. ఉన్న చానెళ్ళతో ఇప్పటికే విసుగుపుడుతుంటే మరి కొన్ని కొత్త చానెళ్ళతో తలబొప్పి కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా సంపాదించిన బ్లాక్ మనీతో మీడియాను బ్రస్టుపట్టించిన కొందరు వ్యక్తులు తన మీడియాను ఇంకా విస్తరించేపనిలో పడ్డారు. ఇప్పటికే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజల మనస్సాక్షి అంటూ ప్రజలకు అసలు మనసేలేదు అన్నట్లుగా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే సాక్షి మీడియాని సృష్టించి జర్నలిజం అనే పదానికి అర్ధం లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల కోసం కాదు తన కోసమే అన్నట్లుగా నిద్ర లేచింది మొదలు జగనుడి దినచర్యనే తన కవరేజ్ గా మార్చిన సాక్షి నుండి మరో మూడు కొత్త చానెళ్ళకు రంగం సిద్దమవుతుందట.

ప్రస్తుతం ఒక్క ఛానల్ గా ఉన్న సాక్షిని త్వరలో నాలుగు ఛానల్స్‌ గా చేసేందుకు జగన్‌ అండ్‌ కో ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సాక్షిని ఆంధ్రా చానెల్‌ గా చేసి త్వరలో తెలంగాణ సాక్షిని ప్రారంభించనున్నారు. అంతేకాదు పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని ఉండే హైదరాబాద్‌ విశేషాలతో మెట్రో సాక్షిని కూడా ప్రారంభించనున్నారట. ఇక ఇప్పటివరకు కేవలం వార్తా ప్రసారాల వరకే ఉన్న సాక్షి త్వరలోనే ఎంటర్‌ టైన్మెంట్ రంగంలోకి దిగాలని భావిస్తుంది. అందుకే ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ను కూడా ఏర్పాటు చేయాలని జగన్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జగన్‌ వద్ద సాక్షితో పాటు మరో రెండు ఛానల్స్‌ ఏర్పాటుకు అనుమతి కూడా ఉండగ.. మరో ఛానల్ కోసం ఇప్పటికే అనుమతి పొందిన వ్యక్తి నుండి హక్కులను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తానికి నాలుగు సాక్షి చానెళ్ళు  రాబోతున్నాయన్నమాట.

అయితే సగటు ప్రేక్షకుడు మాత్రం ఒక ఛానెల్ తోటే వేగలేకపోతుంటే.. మరో మూడు కొత్త ఛానెళ్ళా? ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న సాక్షి టీవీ భారీ నష్టాలలో నడుస్తుందని అందరికీ తెలిసిందే. అయినా కొత్త చానెళ్ళు ప్రారంభించడానికి కారణం మాత్రం తాను విషం కక్కడానికి వీలుగా మరికొంత ఫ్లాట్ ఫాంకోసమేనని అర్ధమవుతుంది. అయినా ఉన్న బ్లాక్ మనీని ఏం చేసుకుంటారులే.. ఇలాంటి ఏదోఒక దుర్మార్గపు ఆలోచనలు చేయడం తప్ప. కనీసం ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేసినా కానీ కొంతమేర అది ప్రజలలో తన మీద ఉన్న భావనను మారుస్తుంది కానీ ఇలా తాను ఏ తప్పు చేయలేదని సొంత డబ్బాకొట్టుకోవడానికి పదేపదే మీడియాను అపహాస్యం చేయడం మాత్రం మర్యాదకరం లేదన్నది మీడియా విశ్లేషకుల వాదన. అయినా సాక్షి పేరు చెబితేనే టీవీలను కట్టేసి అటకమీద పెడుతున్న సమయంలో కూడా అదే బ్రాండ్ తో కొత్త చానెళ్ళు తీసుకువచ్చినా అది ప్రజలలో ఎంత విశ్వాసం కలిగిఉంటుందో మనంముందే ఊహించవచ్చు!

Do you want more TechChaitu Updates ?
Enter your email address:

Comments

Popular posts from this blog

Download Visakhapatnam Tirupati AC Double Decker Express Act