పవన్ కళ్యాణ్ బాబు కోసం మరో మిస్ ఇండియా!
గత కొంత కాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న గబ్బర్ సింగ్ 2 సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ముహూర్తం పెట్టేసాడట. ఎన్నికల హడావుడి అయిపోయి ప్రస్తుతం హాలీడే ప్లాన్స్ లో ఉన్న పవన్ అక్కడ నుండి రాగానే ముందుగా వెంకీతో కలిసి ఓ మై గాడ్ రీమేక్ ను పూర్తి చేసి ఆ తర్వాత వెంటనే గబ్బర్ సింగ్ 2 సినిమా సెట్స్ లోకి వెళ్లాలని చూస్తున్నాడట.
అందుకే ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో రానున్న గబ్బర్ సింగ్ 2 కోసం ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. గబ్బర్ సింగ్ 2 అనగానే మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయింది. గతంలో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ముంబై మోడల్స్ నుండి కేరళ కుట్టీల వరకు చాంతాడంత లిస్టును పరిశీలించగా ఎవరినీ ఫైనల్ చేయలేదు.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరోయిన్స్ వేట మొదలైంది. ఇప్పటికే 2013-మిస్ ఇండియా విన్నర్ నవనీత్ కౌర్ దిలాన్ ను గబ్బర్ సింగ్-2 కోసం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కోసం గతంలో మిస్ ఇండియా సారా జేన్ డియాస్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మిస్ ఇండియా బ్యూటీ నవనీత్ కౌర్ దిలాన్ ను కూడా దిగుమతి చేసుకుంటున్నారనమాట!
Do you want more TechChaitu Updates ?
Comments
Post a Comment