ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కోస్తాకు రైల్వేజోన్!

ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా రైళ్లలో ప్రయాణించేది సీమాంధ్రులు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా వెయ్యి కిలో మీటర్లకు పైగా విస్తీర్ణం ప్రాంతాన్ని దశాబ్దాలుగా రైల్వే శాఖ నిర్లక్ష్యం చేసింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ వస్తున్నా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు అవుతున్నందున అటు రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకు మధ్యలో రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రం విడిపోయిందని బాధపడుతున్న సీమాంధ్రులకు ఇది నిజంగా శుభవార్తే. అటు పోలవరం ఆర్డినెన్స్ వెలువడటం, ఇటు రైల్వేజోన్ వార్త రావడం డబుల్ ధమాకా.గుంతకల్లు నుంచి విశాఖ దాకా రైల్వే పరిధి 3,500ల కిలో మీటర్లుగా ఉంది. నిజానికి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడమే సమంజసం. కాకపోతే గుంతకల్లు, నంద్యాల, తిరుపతి లాంటి రైల్వే కేంద్రాలకు ఈ ప్రాంతం దూరమవుతుందనే ఉద్దేశంతో విజయవాడను, గుంటూరును రైల్వే అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విజయవాడ, గుంటూరులను జంటనగరాలను చేస్తాం అని వెంకయ్యనాయుడు ప్రకటించిన నేపథ్యంలో రైల్వే జోన్ ఈ రెండు నగరాల్లో వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ తూర్పు భారతంలో రైల్వేకి అత్యంత కీలకమైన ప్రాంతం. 

Do you want more TechChaitu Updates ?
Enter your email address:

Comments

Popular posts from this blog