Pawan Kalyan’s emotional speech at Komaram Puli audio release


Pawan Kalyan became emotional during his one hour long speech at Komaram Puli’s music release function yesterday.Usually pawan never attends movie functions and even if is asked to speak in public, he speaks only for couple of minutes.But yesterday fans were stunned to hear him talk for almost an hour in which he opened his heart.
ఎ.ఆర్‌.రెహమాన్‌ సాన్నిధ్యంలో ‘కొమరం పులి’ గీతావిష్కరణ అత్యంత ఘనం గా జరిగింది.. హైదరాబాద్‌ నోవాటెల్‌లో ఆదివారం జరిగిన ఈ వేడులో..అల్లు అరవింద్‌, నాగబాబు, ఎస్‌.జె.సూర్య, శ్రీయ, నికిషా పటేల్‌, గణేష్‌బాబు (నిర్మాత), జయంత్‌, చంద్రబోస్‌, అరుణ్‌పాండ్యన్‌, సోనీ మ్యూజిక్‌ శ్రీధర్‌రాజు, ఆనంద సాయి(ఆర్ట్‌), సత్యరామమూర్తి, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.
పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘జల్సా’ తర్వాత ఆడియో ఫంక్షన్‌కి నేను రావడం ఇదే. నాకిష్టముండదిలా. భారతదేశం గర్వించే సంగీత దర్శకుడి కోసమే ఇది ఒప్పుకున్నా. ఆయన్ని సత్కరించే వేదిక ఇది. అలాంటి అరుదైన వ్యక్తిని నా జీవితంలో కలవ డం మూడోసారి. రెహమాన్‌ ఆస్కార్‌ తెచ్చినప్పుడు నా ఉద్వేగం, ఆనందం చెప్పలేనిది. సూఫీ సెయింట్‌ రెహమాన్‌. ఆయన భగవంతునికిచ్చే పుష్పం సంగీతం. వందేమాత రాన్ని జనానికి చెప్పిన వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప సంగీతానికి విజువల్స్‌ ఇచ్చిన దర్శకుడు ఎస్‌.జె.సూర్య. కథలు వినలేక చచ్చేవాడిని. డబ్బుకోసం గడ్డి తినలేం కదా? ఆ టైంలో నచ్చిన కథ ఇది. మనస్ఫూర్తిగా చేశా.
స్కూల్‌ డేస్‌లో దేశభక్తి పాటలు ఎక్కువ ప్రేరణనిచ్చేవి. పెద్ద దేశభక్తుడిలా ఫీలయ్యేవాడిని. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాలోకి సందేశం జొప్పిస్తా. పాట-సంగీతం లేనిదే మనుగడే లేదు. మీరు నన్నాదరించడానికి పాటే కారణం. ఆదిలాబాద్‌ గిరిజన తాండాల్లో నీళ్లు లేక అల్లాడే జనం..యాసిడ్‌కి బలైన వరంగల్‌ స్వప్నిక..నేనెంతో ప్రేమించిన నాన్న నన్ను వీడివెళ్లినప్పుడు..నాలో ఉద్వేగం అనంతమైంది. అది ఈ చిత్రంలోని ‘నమ్మకమే..’పాటలో ప్రతిఫలించింది. అది విన్నప్పుడు ఏడుపొస్తోంది. ఇక్కడ అన్నయ్య లేకపోయినా అభిమానులు మీరున్నారన్న ధైర్యం ఉంది’ అని ఉద్వేగంగా అన్నారు.

Do you want more CHIRU Updates ?
Enter your email address:

Comments

Popular posts from this blog